Thursday, May 2, 2024

Exclusive | వనమాకు అండగా బీఆర్​ఎస్ అధిష్ఠానం​.. రాజకీయ ప్రస్థానంలో ఇవన్నీ సహజమే!

ఎన్నికల అఫిడివిట్ లో తప్పుడు సమాచారం అభియోగాలతో  తెలంగాణ హైకోర్టు నుండి అనర్హత వేటు ఎదుర్కోంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు బీఆర్​ఎస్​ పార్టీ అండగా నిలుస్తోంది. పార్టీ అధిష్ఠానం నుంచి బలమైన భరోసా లభించినట్లు సమాచారం. పార్టీలో  అత్యంత కీలకమైన నేత  వనమాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లు -విశ్వసనీయ వర్గాల  సమాచారం.

రెండ్రోజుల నుంచి  సదరు కీలకనేత వనమాతో పలు దఫాలు ఈ విషయంలోనే చర్చించినట్లు తెలుస్తోంది. రాజకీయ జీవతంలో  ఇలాంటి సంఘటనలు సహజంగానే జరుగుతుంటాయని , ఆధైర్య పడవద్దని .. పై కోర్టులో అప్పీల్ కోసం తగిన సహకారం అందిస్తామని సదరు నేత వనమాకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.

ప్రజా క్షేత్రంలో గెలిచిన వారే  ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రజాప్రతినిధులని … ధర్మం కచ్చితంగా గెలుస్తుందని సదరు నేత  వనమాకుభరోసా ఇచ్చి  భుజం తట్టి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉండగా  వనమా వేసిన అప్పీల్​పై ఇవ్వాల (గురువారం) మరి కాసేపట్లో హైకోర్టు  తీర్పు రానుంది. ఇది తనకు అనుకూలంగానే ఉంటుందని వనమా ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement