Tuesday, April 30, 2024

ప్రపంచ విశ్వ విద్యాలయాల అథ్లెటిక్స్ పోటీలలో జ్యోతి యెర్రాజికి కాంస్యం…

భారత స్టార్‌ అథ్లెట్‌ తెలుగమ్మాయి జ్యోతి యెర్రాజి ప్రపంచ విశ్వ విద్యాలయాల అథ్లెటిక్స్ పోటీలలో కాంస్య పతకాన్ని సాధించింది. దాంతో పాటు తన జాతీయ రికార్డును కూడా తిరగరాసింది. శుక్రవారం జరిగిన మహిళల 100మీ హార్డిల్స్‌ ఫైనల్స్‌లో 12.78సె.తో పరుగును ముగించి మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు స్లొవెకియాకు చెందిన విక్టోరియా ఫోరస్టర్‌ 12.72సె.తో తొలి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. రెండో స్థానంలో నిలిచిన యాని వు (చైనా) 12.76సె.తో రజతం కైవసం చేసుకుంది. భారత స్టార్‌ అథ్లెట్‌ జ్యోతి 2022లో తాను సాధించిన (12.82సెకండ్స్‌) జాతీయ రికార్డును తాజాగా (12.78సెకండ్స్‌)తో బ్రేక్‌ చేసుకుంది.

పురుషుల 200మీ పరుగులో అవ్లున్‌ బొర్గొహన్‌ కాంస్య పతకం సాధించాడు. భారత స్టార్‌ స్ప్రింటర్‌ అమ్లన్‌ తన రేస్‌ను 20.55సె.తో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement