Friday, May 17, 2024

చరిత్ర సృష్టించిన జ్యోతి సురేఖ బృందం.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

భారత మహిళా ఆర్చర్లు జ్యోతి సురేఖ బృందం చరిత్ర సృష్టించారు. ప్రపంచకప్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల కంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో భారత్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్‌ కౌర్‌, అదితి గోపించంద్‌ జోడీ 235-229తో డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండేజ్‌ జియోన్‌, ఆండ్రియా బెసెరాల (మెక్సికో) బృందంపై విజయం సాధించి పసిడిని ముద్దాడారు.

ఈ టోర్నీలో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన మన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ నేతృత్వంలోని భారత బృందం రెండో సీడ్‌గా బరిలోకి దిగింది. నేరుగా రెండో రౌండ్‌ నుంచి తమ పోటీలను ప్రారంభించిన భారత అమ్మాయిలు తొలి మ్యాచ్‌లో 230-228తో తుర్కియే జట్టును ఓడించింది. తర్వాత జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో చేనీస్‌ తైపీ బృందంపై 228-226తో గెలిచింది. ఇక సెమీస్‌లో 220-216తో కొలండియా అమ్మాయిలను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది.

తుది పోరులో భారత బృంధం మెక్సికో జట్టును చిత్తు చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కి ఇది 11వ పతకం. విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకు ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఘన చరిత్రే ఉంది. ఈ మెగా ఈవెంట్‌లో తెలుగమ్మాయి ఇప్పటివరకు 6 పతకాలు సాధించింది. అందులో వ్యక్తిగత విభాగంలో ఒక రజతం, ఒక కాంస్యం… టీమ్‌ ఈవెంట్‌లో రెండు రజతాలు, ఒక కాంస్యంతో పాటు ఇప్పుడు తాజాగా ఒక స్వర్ణపతకం సాధించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement