Monday, April 29, 2024

ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోపై 28 శాతం జీఎస్టీ.. కేంద్రానికి 19 వేల కోట్ల ఆదాయం

ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోలపై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ విధించాలని తీసుకున్న నిర్ణయంతో 19 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోల టర్నోవర్‌ ఆధారంగా ఈ అంచనా వేశారు. మొత్తం గేమింగ్‌ ఆదాయంపై 28 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. అక్టోబర్‌ 1 నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి వస్తుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు, క్యాసినోల మొత్తం ఆదాయంపై జీఎస్టీ వసూలు చేయనునందున కేంద్రానికి భారీగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

ఈ ఆర్ధిక సంవత్సరంలో 19 వేల కోట్లు జీఎస్టీ మూలంగా వస్తుందని అంచనా వేశారు. అనేక గేమింగ్స్‌ వచ్చే ఆదాయాన్ని వేరువేరు టోర్నోవర్‌గా లెక్కించరని సంబంధిత సీనియర్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఒక గేమ్‌పై ఒక సారి చెల్లించిన మొత్తాన్నే టర్నోవర్‌గా లెక్కిస్తారు. ప్రతి గేమ్‌కు ఎంట్రీ లెవల్‌లో యూజర్‌ చెల్లించే ఫీజుల మొత్తంపై జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఈ విషయంలో గేమింగ్‌ కంపెనీలకు జీఎస్టీ కౌన్సిల్‌ రిలీఫ్‌ ఇచ్చేనట్లేనని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. గేమ్‌ ప్రతి రౌండ్‌లో పెట్టే బెట్టింగ్‌ మొత్తాలను ఇందులో కలపడంలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement