Monday, April 29, 2024

ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో ఆల్మస్‌కు కాంస్యం

కేరళలో జరుగుతున్న ఆసియా పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌ సాధియా ఆల్మస్‌ సత్తా చాటింది. మంగళగిరికి చెందిన సాధియా 57 కేజీల జూనియర్‌ విభాగంలో మూడు గోల్డ్‌ మెడల్స్‌తో పాటు ఆసియా పవర్‌ లిప్టిnంగ్‌లో సత్తా చాటిన సాధియా ఆల్మస్‌ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది.

ఈ విషయాన్ని సాధియా కోచ్‌, తండ్రి ఎస్‌కే సందాని పేర్కోన్నాడు. కాగా పోటీల్లో ఆల్మస్‌ స్వ్కాట్‌లో 57 కేజీల విభాగంలో 190 కేజీల బరువు ఎత్తి వరల్డ్‌ రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా సాధియా ఆల్మస్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ లిప్టిnంగ్‌ సెక్రటరీ సూర్యనారాయణ తదితరులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement