Thursday, May 9, 2024

నానీ దసరా మూవీ నుంచి బ్రేకప్ సాంగ్

నాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్.. హార్ట్ బ్రేక్ సాంగ్‌ను ఏఎంబీ సినిమాస్‌లో చిత్ర యూనిట్ ఈ సాంగ్ ను విడుదల చేసింది. ఓరి వారి నీది గాదుర పోరి’ అంటూ ఈ పాట మొదలవుతోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన‌ ఈ బాణీకి శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు . లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వహాబ్‌ తదితరులు ఈ చిత్రంలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement