Sunday, May 5, 2024

Breaking : అర్జున్ మూవీ నుండి తప్పుకున్న విశ్వక్ సేన్.. ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన నటుడు

సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో యంగ్ హీరో విశ్వక్‌ సేన్ నటించనున్నట్లు తెలిసింది. అయితే ఈ ఏడాది జూన్‌ ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ వేడుకకు పవన్‌ కల్యాణ్ గెస్ట్‌గా వచ్చి సినిమాను లాంఛ్‌ చేశాడు. కాగా ఇటీవలే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం మూడో షెడ్యూల్‌కు సిద్ధమౌతుంది. ఈ క్రమంలో విశ్వక్‌ సేన్‌ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కారణం ఏంటో కూడా చెప్పకుండా విశ్వక్‌ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. అయితే దీనిపై సీరియస్‌ అయిన అర్జున్‌ సర్జా, విశ్వక్‌ పై ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు.ఈ చిత్రానికి అర్జున్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. విశ్వక్‌కు జోడీగా ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ‘కేజీఎఫ్‌’ ఫేం రవిబస్రూర్‌ సంగీతం అందిస్తున్నాడు. విశ్వక్ సేన్ ఈ సినిమా నుండి ఎందుకు తప్పుకున్నాడో తనకి తెలియదని అర్జున్ వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement