Tuesday, May 7, 2024

Breaking : సెప్టెంబ‌ర్ 17పై రాజ‌కీయ కాక‌-విమోచ‌న దినోత్స‌వ‌మా-స‌మైక్య‌తా దినోత్స‌వ‌మా

సెప్టెంబ‌ర్ 17ని నిజాం నుండి విమోచ‌న దినోత్స‌వంగా చేసుకోవాల‌ని తెలిపారు తెలంగాణ గవర్నర్ తమిళి సై . నిజాం నుండి త్యాగాల స్మరించుకోవాల్సిన దినం అని….తెలంగాణ ప్రజల పై జరిగిన అట్రాసిటీ లను మర్చిపోలేమని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలు చరిత్ర తెలుసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 17న ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రారంభించనున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా…ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, కర్ణాటక సీఎం లు కూడా హాజరు కానున్నారు. ఈ మేరకు పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు…చేస్తోంది బిజెపి. హైదరాబాద్ విమోచన ఉద్యమ ఘట్టాలు, ఉద్యమంలో పాల్గొన్న వారి పై పోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వ కమ్యునికేషన్ విభాగం.

అయితే ఈ ఎగ్జిబిషన్ ని గవర్నర్ తమిళ్ సై ప్రారంభించారు . ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవంగా చేసుకోవాలి.. నిజాం నుండి విమోచనం పొందిన దినోత్సవం అని గవర్నర్‌ తమిళిసై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా స‌మైక్య‌త దినోత్స‌వ వేడుక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది రాష్ట్ర‌ప్ర‌భుత్వం..టీఆర్ ఎస్‌..16వ తేదీ నుండి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీలు చేప‌ట్ట‌నున్నారు. 17న ఎన్టీఆర్ స్టేడియంలో వేడుక‌ల‌కు హాజ‌రుకానున్నారు సీఎం కేసీఆర్. 16నుండి 18వ తేదీ వ‌ర‌కు జాతీయ స‌మైక్య‌త దినోత్స‌వ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాగా తెలంగాణ‌లో సెప్టెంబ‌ర్ 17పై రాజ‌కీయ కాక రేగింది. విమోచ‌న దినోత్స‌వ‌మా లేక స‌మైక్య‌తా దినోత్స‌వమా అన్న సందిగ్థ‌త నెల‌కొంది. ఈ మేర‌కు విమోచ‌న దినోత్స‌వ వేడుక‌ల్ని ప్రారంభించారు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.

Advertisement

తాజా వార్తలు

Advertisement