Thursday, May 2, 2024

Breaking : పోలీస్ స్టేష‌న్ లో కోడి బ‌లి – మండిప‌డుతోన్న స్థానికులు

ప్ర‌కాశం జిల్లా బ‌ల్లి కురువ పోలీసుల తీరుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు న‌ల్ల‌కోడిని బ‌లి ఇచ్చి, పూజ‌లు జ‌రిపారు. బ‌ల్లికురువ పోలీస్ స్టేష‌న్ లో న‌ల్ల‌కోడిని బ‌లి ఇచ్చారు పోలీసులు. అంతేకాదు పోలీస్ స్టేష‌న్ గోడ‌ల‌పై ర‌క్త‌పు ముద్ర‌లు వేశారు. పోలీసుల తీరుపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్తువెత్తుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సింది పోయి , పోలీసులే ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డ‌టం ఏంట‌ని నిల‌దీస్తున్నారు ప‌లువురు. దాంతో స్థానికంగా ఈ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement