Tuesday, May 7, 2024

Breaking : బీఆర్‌ఎస్‌తోనే కాంగ్రెస్‌కు ఫైట్‌ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

తెలంగాణలో బీఆర్‌ఎస్‌తోనే కాంగ్రెస్‌కు ఫైట్‌ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు బీఆర్‌ఎస్‌ కూడా ఆలోచన చేయదు అని జగ్గారెడ్డి అన్నారు. బీజేపీకి మాపై ఆరోపణలు చేసే అర్హత లేదని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేశారు అని, కేంద్రంలో బీజేపీ తెచ్చిన బిల్లులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌లో ముఖ్య నాయకుడు.. పార్టీలో కోవర్టులు ఉన్నారు అని అంటున్నారు.. పార్టీలో స్టార్‌లు, సూపర్‌ స్టార్లే మాట్లాడుతుంటే ఎవరికి ఏం చెప్పే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్‌ గాంధీ చెప్పనది ఫైనల్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement