Monday, May 20, 2024

Breaking : కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో అగ్ని ప్ర‌మాదం- 12మృతి – 19మందికి గాయాలు

కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈఘ‌ట‌న‌లో 12మంది మృతి చెందారు. కాగా మ‌రో 19మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్ర‌మాదం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లా ధోలానాలోని ఇండస్ట్రియల్‌ ఏరియాలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగింది. ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 25 మంది కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల పలు ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement