Saturday, May 4, 2024

పాపికొండల విహారయాత్రకు బ్రేక్‌.. వర్షాలు కారణంగా నిలిపివేసిన అధికారులు

దేవీపట్నం, ప్రభ న్యూస్ : మండలంలో గొందూరు పంచాయతీ లో పోచమ్మ గండి రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన, అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. వర్షాలు కారణంగా బోట్లు గోదావరి నదిలో తిరగొద్దని ఆదేశాలు రావడంతో నిలిపి వేశారు.. దేవీపట్నం మండలంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద నుండి ప్రతిరోజు పాపికొండల విహారయాత్రకు గోదావరి నదిలో బోట్లు వెళ్తాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు ఇక్కడ ప్రకృతి అందాలు తిలకిస్తూ, గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ ఎంతో సంతోషం చెందుతారు.

పాపికొండల విహారయాత్ర చేయడానికి అందరు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పర్యాటకులను తీసుకు వెళ్ళడానికి బోట్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం వర్షాలు కారణంగా పాపికొండల విహారయాత్ర నిలిపివేయడం జరిగిందని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ వద్ద నుండి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. వర్షాల ప్రభావం తగ్గే వరకు విహారయాత్ర ఉండదని, గోదావరి నదిలో వర్షాల సమయంలో వెళ్లకూడదని చెప్పారు. పర్యాటకులు సహకరించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement