Monday, May 6, 2024

బాక్సింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌.. ప్రి-క్వార్టర్‌ఫైనల్స్‌కు ఆకాశ్‌, నిషాంత్‌

వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు ఆకాశ్‌ సంగ్వాన్‌ (67కేజీలు), నిషాంత్‌ దేవ్‌ (71కేజీలు) సత్తా చాటారు. శనివారంనాడిక్కడ జరిగిన పోటీలో ఆకాశ్‌ తన ప్రత్యర్థి చైనీస్‌ బాక్సర్‌ ఫు మింగ్కేపై, నిషాంత్‌ తన ప్రత్యర్థి కొరియన్‌ సంగ్మిన్‌ లీపై 5-0తేడాతో విజయం సాధించారు.

తద్వారా ఇరువురూ సునాయాసంగా ప్రి-క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. తదుపరి మ్యాచ్‌లో ఆకాశ్‌ ఐదవ సీడెడ్‌ దులత్‌ బెక్‌బవువ్‌ (కజఖస్తాన్‌)తోను, నిషాంత్‌ తన తదుపరి మ్యాచ్‌లో పాలస్తీనియన్‌ ఫొఖహ నిదల్‌తో తలపడనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement