Monday, April 29, 2024

కరోనా సంక్షోభ సమయంలో దుబారా అవసరమా?: తెలంగాణ సీఎంపై ఏపీ బీజేపీ నేత ఫైర్

తెలంగాణలోని జిల్లాల అదనపు కలెక్టర్లకు కియా కార్నివాల్ కార్లును ప్రభుత్వం అందించడంపై విమర్శల వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఒక్కో కారు ఖరీదు రూ.30 లక్షలు అని, అలాంటివి అధికారుల కోసం 32 కార్లు కొని సీఎం ఇంటి వద్ద కొలువుదీర్చారని వెల్లడించారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం డబ్బును దుబారా చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. కరోనా కష్టకాలంలో రైతులు, నిరుద్యోగ యువత కోసం ఖర్చు చేయకుండా, ఇలా కార్లు కొనడం ఏంటని విష్ణువర్ధన్ ప్రశ్నించారు.

కాగా, తెలంగాణలో జిల్లా అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రవాణా శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఈ వాహనాలను ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పర్యటించడానికి వీలుగా అదనపు కలెక్టర్లకు ఈ నూతన వాహనాలను సమకూర్చారు. రాష్ట్రంలోని 32 జిల్లాలో అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా వాహనాలను ప్రభుత్వం అందజేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement