Friday, May 10, 2024

ప్రొఫెసర్ సిద్ధార్థ్ గా పవన్ కళ్యాణ్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ సినిమాలో ఇదే లుక్ లో కనిపించబోతున్నాడు అంటూ ఓ ఫోటో వైరల్ కాగా….తాజాగా టైటిల్ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది.

ఈ సినిమాకు ప్రొఫెసర్ సిద్ధార్థ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఓ పోస్టర్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా పోస్టర్ పై నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ లో లోగో కూడా ఉండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement