Sunday, May 9, 2021

కేసీఆర్, జానారెడ్డి మంచి దోస్తులు: రాములమ్మ

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మంచి దోస్తులని ఆరోపించారు. ‘జానారెడ్డి సాగర్‌కు ఏం చేశారు. ఏం చేయలేదనే గత ఎన్నికల్లో ఓడగొట్టారు. మళ్లీ ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారు?’ అని రాములమ్మ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌కు అమ్ముకున్నారని విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా అన్ని కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు నిలదీస్తే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది కాదని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News