Thursday, May 6, 2021

తిరుప‌తి …రిఫ‌రెండ‌మే….వైసిపి

తిరుపతి : తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటు-న్నాం … మా అభ్యర్థి గెలిస్తే.. టీ-డీపీ ఎంపీలు రాజీనామా చేయాలి … టీ-డీపీ అభ్యర్థి గెలిస్తే.. మా పార్టీ ఎంపీలు 22మంది రాజీనామా చేస్తారు ….. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని మంత్రి పెద్దిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆదివారం తిరుపతిలోపి పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌లో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీ-డీపీ, బీజేపీ, పవన్‌తో లోపాయికారి ఒప్పందంతో పని చేస్తున్నాయన్నారు.ప్రత్యేక హోదాను ఇవ్వలేని బీజేపీ, ఏ ముఖం పెట్టు-కుని ఓట్లు- అడుగుతోంది? ప్రత్యేక హోదాను తాకట్టు- పెట్టిన వ్యక్తి చంద్రబాబు, ఆనాడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు పవన్‌కు తాజాగా కనిపిస్తున్నాయా? పవన్‌ కల్యాణ్‌ ఒక పొలిటికల్‌ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అని ఎద్దేవా చేశారు. తిరుపతి పార్ల మెంట్‌ ఎన్నికల్లో అన్ని పార్టీలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయని, మేం చాలా ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు- వేయాలని అడుగుతున్నామని, ఈ 22 నెలల్లో సీఎం చేసిన ప్రజాహిత కార్యక్రమాలే మా ఆయుధాలని అన్నారు.
నిపుణుల సలహాతోనే సీఎం సభ రద్దు
ఈనెల 14న తిరుపతిలో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచార బహిరంగ సభను కరోనా కారణంగా నిపుణుల సలహాలు తీసుకున్న తరువాతే సీఎం రద్దు చేసుకున్నారని, ఏ కుటు-ంబానికి కోవిడ్‌ వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో బాధ్యత కలిగిన సీఎంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఉప ఎన్నికలో టీ-డీపీ అభ్యర్థి గెలిస్తే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని చంద్రబాబు, అచ్చెన్నాయుడు సవాల్‌ చేశారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. తిరుపతి ఉపఎన్నికను రెఫరండంగా తీసుకుంటు-న్నాం. ఇక్కడ టీ-డీపీ అభ్యర్థి గెలిస్తే.. మా పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు. మరి మా పార్టీ అభ్యర్థి గెలిస్తే.. టీ-డీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసి.. చంద్రబాబు అనుచరుడు రఘురామకృష్ణంరాజుతో కూడా రాజీనామా చేయిస్తారా?. అని చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నాం అన్నారు. రాత్రి సమయాల్లో విగ్రహాలను పగలకొట్టడం, పగటి పూట ఆ విగ్రహాలను సందర్శించి ఏడవడం తెలుగుదేశం నాయకులకు అలవాటు-గా మారిందని, అచ్చెన్నాయుడి అనుచరులు శ్రీకాకుళంలో ఏ విధంగా విగ్రహాలను రోడ్డు మీద పడేశారో ప్రజలు గమ నించారని, ఆ ఘాతుకానికి సంబంధించిన సీసీ ఫుటేజీని అధికారులు బయట పెట్టారని గర్తుచేశారు. ఈ రాష్ట్రంలో మతపరమైన ఘర్షణలు చెలరేగేలా చేసి తమ ఉనికిని కాపాడుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తోందని, ఆ దిశలోనే సీఎం వైయస్‌ జగన్‌పైనా మతపరమైన బురద చల్లేందుకు కుట్ర చేస్తోందన్నారు.
పొత్తులేకుండా పోటీ చేయలేని విపక్షాలు
2014, 2019లో మేం ఒంటరిగా పోటీ- చేశాం. టీ-డీపీ మాదిరిగా పవన్‌, బీజేపీతో కలిసి పోటీ- చేయలేదని, ఆనాడు ఎన్నికల ముందు చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్‌ మద్దతు ఇచ్చార‌ని, ఈ రోజు పూర్తిగా బీజేపీతో కలిసి లోపాయికారిగా టీ-డీపీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ఒంటరిగా పోటీ- చేసే సంస్కృతి అటు- చంద్రబాబుకు, ఇటు- పవన్‌కళ్యాణ్‌కు లేదని, ఈ రోజు ప్రత్యేకహోదా గురించి మా ఎంపీలు మాట్లాడటం లేదని విమర్శిసున్న చంద్రబాబుకు, మా ఎంపీలు ప్రత్యేకహోదా గురించి పార్లమెంటు-లో ఎన్నిసార్లు కేంద్రాన్ని నిలదీశారో తెలియదా అని ప్రశ్నించారు. సీఎంకు మద్దతుగా వైయస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నామని ఓటర్లకు మంత్రి పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్‌ దత్తపుత్రుడని, ఎక్కడో పవన్‌ కల్యాణ్‌ సినిమా ఆగిపోతే, జాతీయ పార్టీకి అధ్యక్షుడిని అని చెప్పుకునే చంద్రబాబు దానిని ఒక దేశ సమస్యగా తీసుకుని మాట్లాడుతున్నాడని విమర్శించారు. వృద్ధాప్యంలో కూడా వచ్చి ప్రజలను ఓట్లు- అడుగుతున్న చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని, అసలు చంద్రబాబును ఎన్నికల ప్రచారానికి ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు. ఆయన తనయుడు లోకేష్‌ ఒక అజ్ఞాని అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News