Thursday, May 2, 2024

కరోనా బాధ్యతలపై పీఎంవోపై ఆధారపడటం వేస్ట్.. గ‌డ్క‌రీకి అప్ప‌గించండి: సుబ్రహ్మణ్యస్వామి

కరోనా బాధ్యతల నిర్వహణకు సంబంధించి ప్రధాని కార్యాలయంపై ఆధారపడటం వేస్ట్ అన్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.. ఇక ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలని చెప్పారు. పీఎంఓపై ఆధారపడటం దండగని అన్నారు. తాను కేవలం ప్రధాని కార్యాలయాన్నే విమర్శిస్తున్నానని… ప్రధాని మోదీని కాదని చెప్పారు. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు. హర్షవర్ధన్ తన అధికారాలను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఉందని చెప్పారు. గడ్కరీతో కలిస్తే హర్షవర్ధన్ విజయవంతమవుతారని అన్నారు.

మన దేశం మరో కరోనా వేవ్ ను ఎదుర్కోబోతోందని స్వామి హెచ్చరించారు. ఈ వేవ్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతోందని… ప్రతి ఒక్కరు కట్టుదిట్టమైన జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధ్యతలను గడ్కరీకి మోదీ అప్పగించాలని అన్నారు. ప్రధాని కార్యాలయంపై ఆధారపడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement