Monday, May 6, 2024

విలన్ పాత్ర చెయ్యటానికి కూడా సిద్ధమే…విశ్వక్ సేన్

ఫలక్ నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది, హిట్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో పాగల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా విశ్వక్సేన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విశ్వక్. సినిమా కథను, అందులో పాత్రను ఆధారంగా చేసుకుని ఎంచుకుంటానని కథలో ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్ర కూడా చేయడానికి సిద్ధమేనని చెప్పుకొచ్చాడు. రెమ్యూనరేషన్ కి చివరి ప్రాధాన్యత ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement