Sunday, April 28, 2024

బింబిసార‌ని మించేలా సీక్వెల్-క‌ళ్యాణ్ రామ్

బింబిసార చిత్రాన్ని మించేలా సీక్వెల్ ఉంటుంద‌ని హీరో క‌ళ్యాణ్ రామ్ తెలిపారు. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ద‌గ్గర వ‌సూళ్ళ సునామీని సృష్టిస్తుంది. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. ఫాంట‌సీ యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి మ‌ల్ల‌డి వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. కేథ‌రిన్ ట్రెసా, సంయుక్త మీన‌న్ క‌థానాయిక‌లుగా న‌టించారు. కీరవాణి సంగీతం అందించాడు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సుమారు 5 కోట్ల వ‌ర‌కు ప్రాఫిట్స్ వ‌చ్చాయి.

ఈ సినిమా స‌క్సెస్ మీట్‌లోనే పార్ట్-2 కూడా తెర‌కెక్కుతుంద‌ని మేక‌ర్స్ క‌న్ఫార్మ్ చేశారు. ప్ర‌స్తుతం సినిమా స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న టీమ్ త్వ‌ర‌లోనే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను స్టార్ట్ చేయ‌నుంద‌ట‌. పార్ట్-2లో ఏం జ‌రుగుతుంద‌నే దానిపై క‌ళ్యాణ్‌రామ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ‘పార్ట్-2లో అస‌లు బింబిసారుడు ఎవ‌రు. త‌ను త‌న త‌మ్ముడుని ఎందుకు చంపాలి అనుకున్నాడు. బింబిసార విల‌న్‌గా మార‌డానికి కార‌ణం ఏంటి. త‌న జీవితం చిన్న‌ప‌టి నుండి ఎలా సాగింది అనేది బింబిసార్ స్టోరీ’ అని క‌ళ్యాణ్‌రామ్ తెలిపాడు. అంతేకాకుండా ‘బింబిసార-2′ విజువ‌ల్‌ గ్రాండియ‌ర్‌గా ఉండ‌బోతుంది’ అని చెప్పాడు. దీంతో పార్ట్‌-2 పై ప్రేక్ష‌కుల‌లో మ‌రింత క్యూరియాసిటీ పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement