Monday, April 29, 2024

సత్యదేవ్ బ‌ర్త్‌డేకి బిగ్ గిఫ్ట్‌.. నెక్ట్స్ మూవీ కృష్ణమ్మ పోస్టర్ రిలీజ్‌

టాలీవుడ్ యువ నటుడు సత్య దేవ్ ఇవ్వాల (సోమ‌వారం) తన పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్ డేట్ ఒక‌టి రిలీజ్ అయ్యింది. కొరటాల శివ ద‌ర్వ‌క‌త్వంలో కృష్ణమ్మ సినిమా చేస్తున్న‌ట్టు అభిమానుల‌కు స‌త్య‌దేవ్ స‌డ‌న్ స‌ర్ప్రైజ్ ఇచ్చారు. ఊర మాస్ లుక్ లో క‌నిపిస్తున్న స‌త్య‌.. ప్రశాంతంగా నది పక్కన నిలబడి రక్తం కారుతున్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్న పోస్టర్ మేయిన్ అట్రాక్ష‌న్ గా ఉంది.

ఈ గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.. ఇక పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు కూడా త్వరలో ముగుయ‌నున్నాయి. రిలీజ్ అయిన పోస్ట‌ర్ తో అభిమానులు ఈ సినిమా గురించి మ‌రిత‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విబిన్న క‌థనాల‌తో ప్రేక్ష‌కుల‌ను అలరించే సత్య దేవ్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కృష్ణ‌మ్మతో ఈ సారి త‌న అభిమానుల‌న‌ని ఎలా ఆకుట్టుకుంటాడో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement