Saturday, March 23, 2024

ఇంగ్లండ్‌- టీమిండియా 5వ టెస్టు మ్యాచ్‌.. ఇక బౌలర్లదే ఆట!

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా గెలుపు ఇక బౌలర్లపైనే ఆధారపడి ఉంది. 125/3 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాల్గవ రోజు ఆటను టీమిండియా ఆరంభించింది. ఛతేశ్వర్‌ పుజరా, రిషబ్‌ పంత్‌ జోడీ తొలుత ఆచితూచి ఆడారు. ఇద్దరూ కలిసి నాల్గో వికెట్‌కు 28 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బ్రాడ్‌ బౌలింగ్‌లో ఛతేశ్వర్‌ పుజారా (66) బంతిని బౌండరీకి తరలించే యత్నం లీస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అనంతరం బరిలోకి దిగిన శ్రేయాస్‌ అయ్యర్‌ (19) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ సమయంలోనే రిషబ్‌ పంత్‌ (57) అర్దసెంచరీ పూర్తి చేశాడు.

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (23), మహమ్మద్‌ షమీ (13) రాణించడంతో 245 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. దీంతో బుమ్రా సేనకు 377 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 4 వికెట్లు పడగొట్టగా, స్టార్ట్‌ బ్రాడ్‌ 2, మాథ్యూ పాట్స్‌ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం 378 పరుగుల లక్ష్యఛేదనతో ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది. ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ 47, జాక్‌ క్రావ్లే 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 70 పరుగులు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement