Friday, April 26, 2024

సికింద్రాబాద్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ రైలు ప్రారంభం.. 100 శాతం ప్రయాణికులతో భారీ స్పందన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల నుంచి తొలి భారత్‌ గౌరవ్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి శనివారం ప్రారంభమైంది. యాత్రికులకు పండుగ వాతావరణంలో సంప్రదాయబద్ధంగా స్వాగతం లభించింది. ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కూచిపూడి నృత్యకారులు ప్రదర్శించిన నృత్యాలు సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత సన్నివేశాలతో స్టేషన్‌ ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ద.మ.రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ యాత్రికులకు స్వాగత కిట్‌లను అందజేయగా, ఐఆర్‌సిటిసి చైర్మన్‌, ఎండి రజనీ హసిజా పాల్గొన్నారు.

- Advertisement -

పుణ్యక్షేత్ర యాత్ర : పూరీ-కాశి-అయోధ్య పేరుతో ప్రవేశపెట్టిన ఈ రైలును ఐఆర్‌సిటిసి నిర్వహిస్తోంది. ఈ రైలులో అన్ని ప్రయాణ సౌకర్యాలు, వసతి సౌకర్యం, క్యాటరింగ్‌ ఏర్పాట్లు, భోజనం ఉన్నాయి. ఈ సందర్భంగా అరుణ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ యాత్రికులు సాంస్కృతికపరమైన పలు ప్రముఖమైన పుణ్య క్షేత్రాలను సందర్శించడానికి వ్యక్తిగత ప్రయాణ ప్రణాళిక వల్ల ఏర్పడే అవాంతరాలు లేకుండా ఈ రైలు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. రజనీ హసీజ మాట్లాడుతూ పర్యాటకుల ఆసక్తితో పాటు పుణ్యక్షేత్ర ప్రదేశాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని మొత్తం ప్రయాణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement