Thursday, May 16, 2024

Ben Stokes | వన్డే ప్రపంచకప్ తర్వాత మోకాలి సర్జరీ చేయించుకోనున్న ఇంగ్లండ్ ఆల్రౌండర్

భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్ తర్వాత, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ తన మోకాలికి శస్త్రచికిత్స చేయబోతున్నట్లు తెలిపాడు. తన మోకాలి గాయం కారణంగా స్టోక్స్ క్రమం తప్పకుండా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అయితే, జనవరి 25 నుంచి భారత్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌కి తిరిగి రావాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

‘‘భారత్‌లో టెస్టు సిరీస్‌కు నేను బాగానే ఉంటాను. అయితే ప్రపంచకప్ తర్వాత నాకు సర్జరీ జరుగుతోంది’’ అని చెప్పాడు. ఇదిలా ఉంటే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపు (శనివారం) అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్– ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement