Thursday, May 2, 2024

NED vs AFG: ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ 180 పరుగులు

లక్నోలో నెదర్లాండ్స్ వర్సెస్ ఆప్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ వరల్డ్ కప్ 34వ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే నెదర్లాండ్స్ జట్టు 46.3ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

నెదర్లాండ్స్ జట్టు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయింది. నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్లు సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 58పరుగులు, మ్యాక్స్ ఒడ్వాడ్ 42 పరుగులు, కొలిన్ అకెర్మాన్ 29 పరుగులు చేశారు. దీంతో ఆప్ఘనిస్తాన్ విజయలక్ష్యం చేరుకోవాలంటే నిర్ణీత 50ఓవర్లలో 180 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement