Sunday, April 28, 2024

వచ్చే వారం నుంచి ప్రారంభం కానుకన్న బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ ప్రమోషన్స్..

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 2005లో రిలీజ్ అయిన సినిమా ‘ఛత్రపతి’. ఇప్పుడు అదే పేరుతో తెలుగు సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ రీమేక్ మూవీకి మన తెలుగు దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. కాగా, ఈ మూవీ మే 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మేకర్స్ ఇప్పుడు భారీ ప్రమోషన్స్‌ని ప్లాన్ చేసారు. వచ్చే వారం నుంచి ఈ సినిమా పాటలను విడుదల చేయనున్నారు.

సల్మాన్ ఖాన్ కిసీకా బాయ్ కిసీకా జాన్ సినిమా విడుదలయ్యాక మేకర్స్ ఈ సినిమాకు మరింత పబ్లిసిటీ చేయనున్నారు మేకర్స్. కాగా, యూట్యూబ్‌లో తన డబ్బింగ్ సినిమాలు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయని.. ఈ సినిమా ఉత్తర భారతదేశంలోని బాగా ఆడుతుందని బలంగా నమ్ముతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. నార్త్ ఇండియన్ మార్కెట్‌లో గ్రామీణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement