Saturday, April 27, 2024

టీకా వేసుకొండి..బీర్ తీసుకొండి.. ఎక్కడో తెలుసా..?

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. వ్యాక్సినేషన్‌పై ఆసక్తి చూపడం లేదు. దీంతో యువతను బలవంతపెట్టకుండా వారంతంట వారే వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చేలా అదిరిపోయే ప్లాన్‌ను సిద్ధం చేసింది. కొవిడ్ టీకా తీసుకున్న యువతకు ఫ్రీగా బీరు బాటిల్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది అమెరికా. జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు (18ఏళ్లు పైబడినవారు) వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.

టీకా తీసుకున్న యువతకు బీర్ బాటిల్‌ను డోనట్స్‌ను ఆఫర్ చేస్తూ టీకా తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూజెర్సీ గవర్నర్ ‘షాట్ అండ్ ఏ బీర్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా ‘మే నెలలో టీకా మొదటి డోసు తీసుకున్న యువత తమ వ్యాక్సినేషన్ కార్డు ద్వారా ఫ్రీగా బీర్‌ను పొందొచ్చు’ అని పేర్కొన్నారు. 21ఏళ్లు పైడిన యువత మద్యం సేవించడాన్ని న్యూజెర్సీ రాష్ట్రం చట్టబద్ధం చేసింది. దీంతో ఈ 21ఏళ్లుపైడిన యువత మాత్రమే ‘షాట్ అండ్ ఏ బీర్’ ప్రోగ్రామ్‌కు అర్హులు. ఈ నేపథ్యంలో ఫెడరల్, రాష్ట్ర మరియు స్థానిక అధికారులు ఫార్మసీలు, రెస్టారెంట్లు, బీర్ల ఉత్పత్తిదారులు, సూపర్ మార్కెట్లు, క్రీడా బృందాలతో కలిసి యువత వద్దకు వెళ్తున్నారు. టీకా తీసుకున్న యువతకు బీర్ బాటిల్‌ను డోనట్స్‌ను ఆఫర్ చేస్తూ టీకా తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement