Wednesday, March 27, 2024

హా… క్సిజన్

హిందూపురం అర్బన్ – కరోనా రెండో వేవ్‌లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రాణవాయువు (అక్సిజన్‌) అవసరం, వాడకం గణనీయంగా పెరిగింది. అయితే అందుబాటులో ఆక్సిజన్‌ లేక బాధితులు విలవిల్లాడుతున్నారు. కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. రాష్ట్రంలో వారం నుంచి ఈ పరిస్థితి తీవ్రంగా ఉండగా ప్రస్తుతం జిల్లాలోనూ కొరత మొదలైంది. జిల్లాలో అధికశాతం ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ (ఐసీయూ) బెడ్లు అనంతపురం సర్వజన అసుపత్రితో పాటు రెండూ రోజుల క్రితం హిందూపురం కోవిడ్‌ అసుపత్రిలో ఉండగా, ప్రస్తుతం అక్కడ కూడా భయానక పరిస్థితే కనిపిస్తోంది. బెడ్లన్నీ నిండిపోయాయి. వారం క్రితం కంటే ప్రస్తుతం బాధితుల సంఖ్య రెట్టింపు కాగా, ఆక్సిజన్‌ వాడకం కూడా ఆ స్థాయిలో పెంచాల్సి వస్తోంది. దీంతో నిత్యం ట్యాంకర్‌ వస్తేనే తప్ప కోవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందివ్వలేని పరిస్థితి నెలకొంది. సోమవారం హిందూపురం కోవిడ్‌ అసుపత్రిలో ఒక్క సారిగా ఆక్సిజన్‌ అయిపోవడంతో కోవిడ్‌ బాధితుల బంధువులు ఆందోళన చేయడంతో అధికారులు ప్రత్యేక చోరవ తీసుకుని ట్యాంకర్‌ తెప్పించి ఆక్సిజన్‌ ట్యాంకర్‌లో ఫుల్‌ చేయించారు. పరిస్థితి మెరుగుపడాలంటే అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఈ నెలలో తీవ్రరూపం దాల్చింది. మూడు వారాలుగా నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి, ఇక జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. కేసులు సంఖ్య పెరుగుతుండటంతో పాటు, వైరస్‌ తీవ్రత కూడా అధికంగా ఉంటోంది. దీంతో ఆస్పత్రుల్లో చికిత్స కోసం అందులోనూ ఆక్సిజన్‌, వెంటిలేటర్‌పై చికిత్స ఇవ్వాల్సిన వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది.
తగ్గిన ఆక్సిజన్‌ సరఫరా
దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో జిల్లాకు సరఫరా తగ్గింది. హిందూపురం కోవిడ్‌ అసుపత్రికి కర్నాటక రాష్ట్రం బెంగళూరు నుంచి ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. దీంతో పాటు హిందూపురం తూమకుంట పారిశ్రామిక వాడలో సైతం ఆక్సిజన్‌ తయారవుతోంది.అయితే బెంగళూరు నుంచి వచ్చే ఆక్సిజన్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. హిందూపురం కోవిడ్‌ అసుపత్రిలో చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా 6 వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటు ఉంది.ఈ ప్లాంటు నుండి వార్డులకు పైపులైన్‌ ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు సిలిండర్లు సైతం అత్యవసర సమయంలో వినియోగించుకోవాడానికి సిద్ధం చేసుకున్నారు. రోగుల సంఖ్య పెరగిన నేపథ్యంలో రోగులకు తగ్గట్టు ఆక్సిజన్‌ సరఫరా తగ్గింది. వెంటిలేర్లు పూర్తి స్థాయిలో వినియోగిస్తే గంటల్లోనే అసుపత్రిలో ఉన్న ఆక్సిజన్‌ అయిపోతుందని వైద్యులు అంటున్నారు. వెంటి లేటర్లకు ప్రత్యేకంగా 12 వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తే సమస్య కాస్తా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ఏ రోజుకారోజే …
ప్రస్తుతం ప్రతిరోజు ఒక ట్యాంకర్‌ వస్తేనే తప్ప ఇక్కడ బాధితులకు చికిత్స అందే పరిస్థితి కనిపించడం లేదు. కాగా వెంటిలేటర్‌పై చికిత్స చేయాల్సిన బాధితుల సంఖ్య ఎంత పెరిగితే అంతమేర ఆక్సిజన్‌ అవసరం పెరుగుతుండటంతో దినదినగండంగా మారింది. ఇదిలా ఉండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కోసం ఏజెన్సీల నుంచి ఆక్సిజన్‌ కొనుగోలు చేస్తుండగా వారు కొంతమేర ధరలు పెంచి అమ్ముతున్నట్లు సమాచారం. అనంతపురం, హిందూపురం, బత్తలపల్లి మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఆక్సిజన్‌ అందుబాటులో లేక బాధితులు ఇతర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement