Tuesday, April 30, 2024

తెలంగాణ బ్యాంకులు భేష్‌.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బాగా పనిచేస్తున్నయ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో తెలంగాణలో బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక బ్యాంకుల ప్రాధాన్యం బాగా పెరిగిందని, పేద ప్రజలకు, బడుగులకు ఆత్మ విశ్వాసం కలిగించేలా మోడీ జన్‌ ధన్‌ ఖాతాలు తెరిపించారని ఆయన గుర్తు చేశారు. జన్‌ ధన్‌ ఖాతాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య దళారీ దోపిడీ లేకుండా సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అమలు చేస్తున్నాయన్నారు. శనివారం ఆయన #హదరాబాద్‌ కోఠిలోని ఎస్‌బీఐ బ్యాంకులో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలకు బ్యాంకులు లోన్లు ఎలా మంజూరు చేస్తున్నాయనే దానిపై ఆయన సమీక్షించారు.

- Advertisement -

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని, వాటి పనితీరు మెరుగుపడటానికి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంట రుణాలు 2020-21లో రూ.40,564 కోట్లు, 2021-22లో రూ. 42,853 కోట్లు, 2022-23లోరూ. 40,718 కోట్ల మంజూరు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 58.43శాతం రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. కరోనా సమయంలో బ్యాంకులు బాగా పనిచేయడంతో సామాన్యులకు ఇబ్బందులు రాలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో మొత్తం రూ.6,32,834 కోట్ల డిపాజిట్లు ఉంటే… అదేస్థాయిలో వివిధ బ్యాంకుల ద్వారా రూ.7,25,568 కోట్లు రుణాలు ఇవ్వడం విశేషమన్నారు. ఇలా ఏ రాష్ట్రంలో ఇవ్వలేదన్నారు. తెలంగాణలో బ్యాంకులకు వచ్చిన డిపాజిట్ల కంటే ఎక్కువగా అప్పులు ఇచ్చాయన్నారు.

అందుకే క్రెడిట్‌ డిపాజిట్‌ రేషియో దేశంలోనే ఎక్కువగా114.65 శాతం ఉందన్నారు. ఇది బ్యాంకుల పనితీరుకు అద్దం పడుతున్నదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఆయా ప్రాధాన్య రంగాల కింద రూ.84,143 కోట్ల రుణాలు ఇచ్చాయని, ఇందులో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.38,737 కోట్లు మంజూరు చేశాయన్నారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకంలో భాగంగా నిర్దేశిత వార్షిక లక్ష్యం రూ.8909.83 కోట్లకు గాను, 26,8,853 మంది లబ్ధిదారులకు మొదటి రెండు త్రైమాసికాల్లో రూ.4,484 కోట్ల రుణాలు మంజూరు చేశాయని ఆయన వివరించారు. స్టాండప్‌ ఇండియా పథకం కింద బ్యాంకులు రాష్ట్రంలో రూ.2,277 కోట్లతో 9,044 యూనిట్లకు ఆర్థిక సహకారం అందించాయన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌(పీఎంఈజీపీ) కింద 3302 యూనిట్ల వార్షిక లక్ష్యానికి గాను బ్యాంకులు ఇప్పటి వరకు 1165 యూనిట్లకు ఆర్థిక స#హకారం అందించాయని తెలిపారు.పీఎం స్వనిధి పథకంలో భాగంగా బ్యాంకులు 5,21,862 వీధి వ్యాపారులకు లోన్లు మంజూరు చేయగా అందులో 4,54,956 మందికి లోన్ల కింద ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంగా వీధి వ్యాపారులకు ఇంత పెద్ద ఎత్తున కేంద్రం సాయం అందిస్తున్నదన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద బ్యాంకులు 62,516 గృ#హ నిర్మాణాలకు లోన్లు మంజూరు చేసినట్లు, అందులో లబ్ధిదారులు రూ. 1427.72 కోట్ల సబ్సిడీ పొందినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement