Sunday, May 5, 2024

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది: బండి సంజయ్

తెలంగాణలో కరోన విజృంభిస్తుంటే సీఎం కేసీఆర్ ఫామ్ లో సేద తీరుతున్నాడని విమర్శించారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రం లో జనం పిట్టల్లా రాలిపోతుంటే కేఆసీఆర్ ఒక్క సారైనా సమీక్ష చేశాడా అని ప్రశ్నించాడు. . మంత్రి ఈటల తో కేంద్ర ప్రభుత్వాన్నీ విమర్శించడం తప్ప కేసీఆర్ చేసిందేమిటని అని ఫైర్ అయ్యారు.

రాష్ట్రం లో ఆక్సిజన్, రెమ్ డెసీవర్ ఇంజెక్షన్ల కొరతపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నారు బండి సంజయ్. కావాలనే రెమ్ డెసీవర్ ఇంజెక్షన్ కు కృత్రిమ కొరత సృస్టించి… కంపెనీలు, డిస్ట్రీబ్యూటర్లు రెమ్ డెసీవర్ ను ఎమార్పి కంటే చాలా ఎక్కువ ధరలో అమ్ముతున్నారన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర పీటభుత్వం పట్టించుకోవట్లేదుని ఆరోపించారు. రెమ్ డెసీవర్ ధర అందరికి అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఎమ్మార్పీ తగ్గేలా చర్యలు తీసుకుంది. ఆక్సిజన్ ను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి రోజు పరిశ్రమలు, రైల్వే , వైద్య శాఖతో సమీక్ష చేస్తున్నారు. దేశమంతా ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకు రైల్వే శాఖ సమాయత్తం అయింది. రాష్ట్రం లోని పంపిణీ వ్యవస్థ అష్టవ్యస్థంగా ఉండటం వల్ల రెమ్ డెసీవర్ కృత్రిమ కొరత ఏర్పడిందన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్స్, వైద్య సిబ్బంది, మందుల విషయం లో ఉన్నత స్థాయి రివ్యూ చేయాలి. రాష్ట్రం కరోన కేసులు, మరణాలను తగ్గించి చూపడం వల్లే ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం లో కోవిడ్ కేసులు పెరగడానికి రాష్ట్ర వైఖరే కారణం వ్యాక్సిన్ వేసుకోవాలని ఇప్పటిదాకా ఒక్క సారి కూడా సీఎం ప్రజలకు చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు, N-95 మాస్కులు ఇవ్వక పోవడం దారుణమన్నారు. ప్రజలందరూ కోవిడ్ విషయం లో జాగ్రత్తగా ఉండాలి. అందరూ కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పా ఎవరు బయటకు రావద్దరావద్దని పిలుపునిచ్చారు బండి సంజయ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement