Tuesday, May 7, 2024

మంత్రి మేకపాటి మరణం బాధాకరం: బండి

ఆంద్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి మరణం అత్యంత బాధాకరం. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నా” అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement