Monday, April 29, 2024

ఆస్ట్రేలియాలో ఘనంగా బాలకృష్ణ బర్త్ డే వేడుకలు

నిన్న సినీ నటుడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఎన్.బి.కె యువసేన నిర్వహించిన సెలబ్రేషన్స్ కు తెలుగు అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అది చూసి మరొక సినీ నటుడు నారా రోహిత్ తెలుగు ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ… ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అడిలైడ్ ఎన్.బి.కె యువసేన నిర్వహిస్తున్న విరాళాల సేకరణ, ఆ వివరాలు మొత్తం అన్నగారు నందమూరి తారక రామారావు క్యాన్సర్ హాస్పిటల్ కి విరాళాలుగా ఇస్తామని తెలియజేయడంతో వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాగర్లమూడి మనోజ్, ప్రవీణ్, సుజీ, సుమంత్, వెంకట్, వికాస్, నాగేందర్, మనోహర్ సందీప్, సురేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement