Friday, April 26, 2024

బాల‌కృష్ణ ‘వీర‌సింహారెడ్డి’కి రూ.104 కోట్లు సంక్రాంతి న‌జ‌రానా..

న‌ట‌సింహ బాల‌కృష్ణ‌కి తెలుగు ప్ర‌జ‌లు సంక్రాంతికి ఏకంగా రూ .104 కోట్లు న‌జ‌రానా స‌మ‌ర్పించి అభిమానాన్ని చాటుకున్నారు. సంక్రాంతి పండ‌గ కానుక‌గా బాలయ్య న‌టించిన వీర‌సింహ‌రెడ్డి ఈ నెల 12 విడుద‌లై బ్లాక బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. బాలకృష్ణ ఇంతవరకూ చేస్తూ వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్స్ ను నమోదు చేసినవే ఎక్కువ. అలాగే సంక్రాంతికి విడుదలైన ఆయన సినిమాలలో సక్సెస్ ను సాధించినవే ఎక్కువ. ఆయన తాజా చిత్రమైన ‘వీరసింహారెడ్డి’కి ఈ రెండు సెంటిమెంట్లు వర్కౌట్ కావడంతో కేవ‌లం నాలుగు రోజుల్లో ఏకంగా రూ.104 కోట్ల క‌లెక్ష‌న్ రాబ‌ట్టింది.. బాల‌య్య చ‌రిత్ర‌లోనే తొలి రోజునే రూ.54 కోట్ల గ్రాస్ ను ఈ మూవీ వ‌సూలు చేసింది. మైత్రీ బ్యానర్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాస‌న్ హీరోయిన్.. బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement