Wednesday, May 1, 2024

ఫ‌స్ట్ టైం డిజిట‌ల్ వేదిక‌పై ప్ర‌భాస్.. అన్ స్టాప‌బుల్ 2కి గెస్ట్ గా స్టార్ హీరో

ఆహా తెలుగు ఓటీటీలో అన్ స్టాప‌బుల్ షో దూసుకుపోతోందిద‌.ఈ షోకి హీరో బాల‌కృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా అన్ స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొననున్నాడు స్టార్ హీరో ప్రభాస్ .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. మొదటి సారి డిజిటల్ వేదికపైకి అరంగేట్రం చేయనున్నారు.ఈ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ప్రభాస్ ఒంటరిగానే వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభంకాబోతున్నట్లు తెలుస్తోంది.

వీరికి సంబంధించిన ఎపిసోడ్ న్యూయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.ప్ర‌భాస్ ఆహా అన్ స్టాప‌బుల్ షోకి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. పాన్ ఇండియా స్టార్ విత్ గాడ్ ఆఫ్ మాస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ రాబోతుందంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement