Friday, May 10, 2024

TTD | శ్రీవాణి ట్రస్టుపై దుష్ప్రచారం

తిరుమల, ప్రభన్యూస్‌ : శ్రీవాణి ట్రస్టులో ఎటువంటి అవకతవకలు జరగడం లేదని, అవగాహన లేకుండానే కొందరు శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ పింక్‌ డైమండ్‌ పోయ్యింది నేలమాలిగలు తరలించారంటూ గతంలో కూడా టీటీడీపై అపోహలు సృష్టించారని ఇవన్నీ ఆరోపణలేనని అప్పట్లోనే ఖండించానన్నారు.

- Advertisement -

ప్రతినెలా 1 వ తేదిన శ్రీవాణి ట్రస్టుకు ఎంత విరాళాలు వచ్చిందో టిటిడి ప్రకటించి భక్తుల్లో ఉన్న అనుమానాలను టిటిడి తీర్చాలన్నారు. దూపధీప నైవేద్యాలు లేని ఆలయాలకు, మత్స్యకార ప్రాంతాల్లోని 574 ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించాలన్నారు. పింక్‌ డైమండ్‌ పై టిటిడి వేసిన పరువునష్టం దావా కేసులో కోర్టుకు రెండుకోట్ల రూపాయల భక్తుల డబ్బును చెల్లించి తిరిగి టిటిడి ఆకేసుని విత్‌డ్రా చేసిందని, ఆ సొమ్మును టిటిడి పాలకమండలి, అధికారులు వడ్డీతో సహా టిటిడికి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement