Saturday, May 4, 2024

ఆర్జీవీవికి బాబు గోగినేని స‌ల‌హా.. ఇగో ఆ క్యారెక్ట‌ర్ల‌తో ట్రాజి-కామెడీ మూవీ తీయొచ్చు..

సామాజిక వేత్త, హేతువాది, మానవవాది అయిన బాబు గోగినేని అంటే అందరికీ తెలుసు. ఆయన ఆర్జీవీ, ఏపీ ప్రభుత్వం, టికెట్ అంశం, మంచు విష్ణు, మోహన్ బాబు, కమెడియన్ పృథ్వీ ఇలా అందరినీ వరుస పెట్టి ఒకే పోస్ట్‌లో ఏకి పారేశారు. తాజాగా ఆయన వేసిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు కామెంట్లతో అసలు విషయాన్ని బయటపెట్టేస్తున్నారు. బాబు గోగినేని పరోక్షంగా చెప్పిన మాటలకు అసలు అర్థాలను నెటిజన్లు చెప్పేస్తున్నారు.

‘ఎలక్షన్లప్పుడు స్పాన్సర్డ్ మిమిక్రీ సినిమాలు తీసిన వాళ్లను, ఆ మిమిక్రీ సినిమాల్లో సంబరంగా యాక్టింగ్ చేసిన జర్నలిస్ట్ లను, పదవులనాశించి క్యాంపెయిన్ చేసిన పిరికి హీరోలను, సీఎం నా బావ అని గొప్పలు చెప్పుకున్న పహాకాలను, లెజెండరీ పెదరాయుళ్లను, వెనకనుండి వచ్చి పట్టుకుని మరీ సపోర్ట్ చేసిన ఎకిలి కమీడియన్లను, వీళ్ళందరికంటే ఎన్నికలకు ఫైనాన్సింగ్ ఇచ్చి రొమ్ము మీద గుద్దిచ్చుకున్న ప్రొడ్యూసర్లను, వీరందరినీ క్యారెక్టర్లుగా వాడుకుని ఒక మంచి ట్రాజీ కామెడీ సినిమా తీయవచ్చు.

కొవిడ్‌కు భయపడకుండా ఆ సినిమాను సరసమైన ధరకు థియోటర్లలో రిలీజ్ చేయాలి అని, ప్రతి ఒక్కరికీ వోడ్కా తాగుతూ సినిమా చూసే అవకాశం ఇవ్వాలని నా డిమాండ్. ప్రభుత్వానికి తనకు అర్థం కాని సినిమా వ్యాపారంతో ఏమి సంబంధం అంటారా? అదే! అదే! తమకు అర్థం కాని రాజకీయ వ్యాపారంలో మనోళ్లు దూరలా? అందుకోండి మీ తెలివికి నందులు, పందులు, లిజెండ్ బిరుదులు’ అని బాబు గోగినేని సెటైరిక్ గా పోస్ట్ చేశారు.

ఇక ఈ పోస్ట్ మీద నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఒక్కో కామెంట్ వెనకాల ఉన్న అసలు పేర్లను చెబుతున్నారు. స్పాన్సర్డ్ మిమిక్రీ సినిమాలు అంటే.. 1 కమ్మ రాజ్యంలో కడపబిడ్డలు 2 పవర్ స్టార్.. సంబరంగా నటించిన జర్నలిస్ట్‌లు స్వప్న, కత్తి మహేష్.. పహాకం – టంగుటూరి వీరేహం పహాకం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు.. లెజండరీ (సెలబ్రెటీ) పెదరాయుడు మంచు మోహన్ బాబు, పదవులకి ఆశించి కేంపైన్ చేసిన నటులు 30 ఇయర్స్ పృధ్విరాజ్, యాంకర్ శ్యామల, జీవిత, రాజశేఖర్, కమేడియన్ ఆలీ అంటూ కామెంట్ల మీద‌ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement