Monday, October 7, 2024

‘ఆస్ట్రేలియా’ జ‌ట్టుపై మ‌హేశ్ బాబు ప్ర‌శంస‌లు..

ఆస్ట్రేలియా జ‌ట్టు చాలా బ‌ల‌మైన‌ద‌ని ట్వీట్ చేశారు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు. నిన్నటి మ్యాచ్ లో చాలా బాగా రాణించారు. విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు. డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు ఒక లెజెండ్ ఆటగాడు. ” అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు మహేష్ బాబు. టి20 ప్రపంచ కప్ 2021 విశ్వవిజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్ ఫైనల్ లో భాగంగా నిన్న న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తర ఫైనల్ మ్యాచ్ జరిగింది.

అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఈ కింద నాలుగు వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 172 పరుగులు చేసిందిన్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ 85 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అయితే 173 పరుగుల చేంజింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు… కేవలం రెండు వికెట్లు కోల్పోయి… 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా… విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయానికొస్తే… డేవిడ్ వార్నర్ 53 పరుగులు అలాగే మిచెల్ మార్స్ 77 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి…

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement