Saturday, April 27, 2024

National : గుజ‌రాత్‌లో విదేశీ విద్యార్థుల‌పై దాడి…

గుజ‌రాత్‌లో విదేశీ విద్యార్థుల‌పై దాడి చేశారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్ప‌డ్డారు. విదేశీ స్టూడెంట్స్‌పైకి రాళ్లు విసరడమే కాకుండా హాస్టల్‌ గదిని కూడా ధ్వంసం చేశారు.

- Advertisement -

దాడిలో గాయపడ్డ విద్యార్థులను సమీపంలోని ఎస్‌వీపీ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. దాడితో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ గేట్లన్నీ మూసివేశారు. విదేశీ విద్యార్థులపై దాడి చేసింది ఎవరనేది తేల్చేందుకు దర్యాప్తు మొదలు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement