Saturday, April 27, 2024

పెళ్ళికి నిరాక‌ర‌ణ‌..యువ‌తిపై దాడి..విష‌మంగా యువ‌తి ప‌రిస్థితి..

త‌న‌తో పెళ్లికి నిరాక‌రించింద‌నే నెపంతో ఓ యువ‌తిపై దాడికి దిగి, క‌త్తితో 18పోట్లు పొడిచాడు ఓ ఉన్మాది. ఈ సంఘ‌ట‌న ఎల్బీన‌గ‌ర్ లో చోటు చేసుకుంది. కాగా ఎల్బీ నగర్ లోని నవీన హాస్పిటల్ లో యువతికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం బాధిత యువతి కండిషన్.. క్రిటికల్ గానే ఉంది. కాగా వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు బస్వరాజు ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత కొంతకాలంగా ఎల్బీనగర్ లోని హస్తినాపురంలో తన పిన్ని తో కలిసి ఉంటోంది… గతంలో బాధిత యువతి.. నిందితుడు బస్వరాజు ప్రేమాయణం చోటు చేసుకుంది. అయితే… బస్వరాజు తో పెళ్లికి నిరాకరించారు శిరీష తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలోనే… శ్రీధర్ అనే వ్యక్తితో ఇటీవల శిరీషకు ఎగేంజ్ మెంట్ చేశారు. విషయం తెలుసుకున్న బస్వరాజు శిరీష పై అక్కసు తో దాడికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement