Saturday, April 27, 2024

అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్స్‌ కు ఏర్పాట్లు.. జూలై 21 టోర్నమెంట్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మేధోవికాసానికి, బుద్ధి కుశలతకు దోహం చేసే చదరంగం క్రీడాంశానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ చెప్పారు. తెలంగాణ చెస్‌ అసోసియేషన్‌,స్పోర్ట్స్‌ లోకల్‌ ఏరియా నెెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో జూలై 21 నుంచి 25వ తేదీవరకు హైదరాబాద్‌ లో నిర్వహించనున్న మొదటి అంతర్జాతీయ ఓపెన్‌ ఫిడే చెస్‌ టోర్నమెంట్‌ వాల్‌ పోస్టర్‌ ను సాట్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ఆంజనేయగౌడ్‌ ఆవిష్కరించారు. సందర్భంగా సాట్స్‌ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్నిరంగాల మాదిరిగానే గత దశాబ్ది కాలం నుంచి క్రీడారంగాన్ని అంచలంచెలుగా అభివృద్ధి చేశారనీ, చెస్‌ క్రీడా కారులను ఎంతగానో ప్రోత్సహించిన ఘనత కేసీర్‌ కు దక్కుతుందన్నారు.

ఉప్పల ప్రవీణ్‌, నందిత వీరపల్లి లాంటి ఔత్సాహిక చెస్‌ క్రీడాకారులకు కేసీఆర్‌ ప్రభుత్వం నగదు ప్రోత్సహకాలు అందించారని ఆయన గుర్తు చేశారు. వివిధ క్రీడా సంఘలు నిర్వహించే టోర్నమెంట్స్‌ తరపున పూర్తిగా సహకరిస్తామని ఆయనతెలిపారు. సీఎం కప్‌ జిల్లా స్థాయిపోటీల నిర్వహణకు రాష్ట్ర పర్యాటక, టూరిజం,ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చంద్రమౌళి నవీన్‌ నాయక్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement