Monday, May 20, 2024

హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం.. ఈ వేలంలో రూ.206.29 కోట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హెచ్‌ఎండీఏకు భారీగా ఆదాయం వచ్చింది. ఎంఎస్‌టీసీ నిర్వహించిన ప్లాట్ల ఈ వేలానికి భారీ స్పందన లభించింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి, మేడిపల్లిలో ఓపెన్‌ ప్లాట్ల రెండో దశ ఈ వేలంను నిర్వహించారు. బాచుపల్లిలో మొత్తం 133 ప్లాట్లు, 67,894.23 చదరపు గజాల విస్తీర్ణం, మేడిపల్లిలో 85 ప్లాట్లను వేలం వేశారు.

ఈ ప్లాట్ల మొత్తం అప్‌సెట్‌ ధర విలువ 189.88 కోట్లు కాగా 206.29 కోట్ల ఆదాయం వచ్చింది. బాచుపల్లిలో చదరపు గజానికి అత్యధికంగా ధర రూ.53,500 పలుకగా, మేడిపల్లిలో చదరపు గజానికి 50 వేలు పలికింది. బాచుపల్లిలో కనీస ధర చదరపు గజానికి రూ.25 వేలు ఉండగా వేలంలో సగటు ధర చదరపు గజానికి 39,674 రూపాయలు పలికింది. మొత్తం 218 ప్లాట్లకు కాగా, 209 ప్లాట్లు వేలంలో అమ్ముడయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement