Thursday, May 9, 2024

పెళ్లి పీట‌లెక్క‌నున్న అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య.. మ‌నుసుప‌డ్డ వ్య‌క్తితోనే మ‌నువు

అర్జున్ కూతురు ఐశ్వర్య త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నుంది. సీనియర్ నటుడు అర్జున్ సర్జా, తన కూతురు ఐశ్వర్యతో తెలుగు సినిమా ప్లాన్ చేశాడు. విశ్వక్ సేన్ ని హీరోగా పెట్టాడు. అయితే కొన్ని విభేదాల కారణంగా విశ్వక్ సేన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఇక‌ చాలా రోజులుగా తన కూతురితో తీస్తున్న అర్జున్ ఆ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌లో పెట్టాడు.

తాజాగా ఐశ్వర్య సర్జా పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య.. ఐశ్వర్య అర్జున్‌ను వివాహం చేసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. సినీ నివేధికల ప్ర‌కారం, వీరిద్ద‌రూ చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement