Wednesday, May 15, 2024

BSNL-MTNL పునరుద్ధరణ ప్రణాళికకు ఆమోదం.. ఎంపీ సత్యవతి ప్రశ్నలకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీఎస్‌ఎన్‌ఎల్-ఎంటీఎన్‌ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను ఆమోదించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత మూడేళ్లలో టెలికాం సంస్థల ఆర్థిక పరిస్థితి, సమగ్ర వివరాలు తెలియజేయాల్సిందిగా అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి బుధవారం లోక్‌సభలో కోరారు. బీఎస్‌ఎన్‌ఎల్-ఎంటీఎన్‌ఎల్‌ విలీనం వల్ల నష్టపోతున్నవారి కోసం పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించడానికి ప్రభుత్వం ఏదైనా ప్రణాళికను రూపొందించిందా అని ప్రశ్నించారు. మరేదైనా టెలికాం ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందా అని అడిగారు.

గత మూడేళ్లలో పీఎస్‌యుల పని తీరును కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి దేవ్‌సిన్హ్ చౌహాన్ వివరించారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం, సావరిన్ గ్యారెంటీ బాండ్లను పెంచడం ద్వారా రుణ పునర్నిర్మాణం, మూలధన ఇన్ఫ్యూషన్ ద్వారా 4జీ సేవల కోసం స్పెక్ట్రమ్ కేటాయింపులను వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆచరణీయ ప్రభుత్వ రంగ సంస్థగా మార్చడానికి, ప్రభుత్వం ఈ ఏడాది జులై వరకు బీఎస్‌ఎన్‌ఎల్ కోసం రూ. 1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించిందని కేంద్రమంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement