Wednesday, May 22, 2024

AP | భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దు..

అమరావతి, ఆంధ్రప్రభ : విజయవాడ డివిజన్‌లో వారం రోజులపాటు పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లింపు చేసినట్లు పేర్కొంది. నవంబరు 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గుంటూరు – విశాఖ (రైలు నెం.17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే అధికారులు రద్దు చేశారు.

రాజమండ్రి – విశాఖ (రైలు నెం.07466) మెమూ, విశాఖ – రాజమండ్రి (రైలు నెం.07467) మెమూ రద్దయ్యాయి. అదేవిధంగా ఈనెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖ – గుంటూరు (రైలు నెం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేసినట్లు- రైల్వే అధికారులు ప్రకటించారు.

- Advertisement -

అలాగే కాకినాడ పోర్టు – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17267), విశాఖపట్నం – కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్‌ (17268), రత్నాచల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717,12718) – విజయవాడ, విశాఖపట్నం మధ్య, గుంటూరు – రాయగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ (17243), మచిలీపట్నం – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17219) రైళ్ళు నవంబర్‌ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అధికారులు రద్దు చేశారు.

ఇక విశాఖపట్నం – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17220), రాయగడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17244) రైళ్ళను నవంబర్‌ 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రద్దు చేశారు.

సూరత్‌ – బ్రహ్మపుర స్పెషల్‌ రైళ్లు..

దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రైల్వే ప్రత్యేక రైళ్ళు నడుపుతోంది. దీనిలో భాగంగా నవంబర్‌ 8, 15, 22, 29 తేదీల్లో ప్రయాణీకుల సౌకర్యార్ధం సూరత్‌ – బ్రహ్మపుర (09069) ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే ఇదే రైలు డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 2.20 గంటలకు సూరత్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.10 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది.

అదే రోజు రాత్రి 8.58 గంటలకు పెందుర్తికి చేరుకుంటుంది. అలాగే నవంబర్‌ 10, 17, 24 తేదీల్లో, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో తిరుగు బ్రహ్మపుర – సూరత్‌ (09070) ప్రత్యేక రైలు తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి ఉదయం 7.10 గంటలకు పెందుర్తికి, ఆ తర్వాత 8.20 గంటలకు దువ్వాడకు చేరుకుంటు-ందని, ఈ మేరకు ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల సదుపాయాలను వినియోగించుకోవల్సిందిగా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement