Thursday, May 2, 2024

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం-స‌ల్మాన్ ఖాన్ డూప్ మృతి

2020నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు.. దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే గుండెపోటుతో మరణించారు. ముంబైలో జిమ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. సాగర్ పాండే ఆత్మకు శాంతి కలగాలని కోరారు. సాగర్ సల్మాన్ తో బజరంగీ భాయిజాన్, ట్యూబ్ లైట్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, దబాంగ్, దబాంగ్ 2 చిత్రాల్లో నటించాడు.ఆయ‌న మృతికి ప‌లువురు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement