Saturday, May 4, 2024

ఇండియ‌న్ మార్కెట్ లో మ‌రో స్మార్ట్ ఫోన్.. బ‌డ్జెట్ రేంజ్ లో ఐకూ జడ్ 7 ప్రో 5జీ

భారత స్మార్ట్ ఫోన్ మార్క‌ట్ లో ఐకూ మ‌రో కొత్త ఫోన్ లాంఛ్ అయింది. ఇవ్వాల (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియం రేంజ్ బడ్జెట్ లో ‘‘ఐకూ జడ్ 7 ప్రో 5జీ’’ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. మరి ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత వంటి వివరాలు తెలుసుకుందాం…

స్పెసిఫికేష‌న్స్ & ఫీచ‌ర్లు..

జడ్ సిరీస్ లో కొనసాగింపుగా ఈ ఫోన్ ను తీసుకొచ్చింది. అయితే, ఈ ఫోన్ బరువు కేవలం 175 గ్రాములతో చాలా పలుచగా, ఈ ఫోన్ ది స్లిమ్మెస్ట్ ఫోన్ అని ఐకూ చెబుతోంది. తేలికగా ఉంటుందని పేర్కొంది. ఇక‌ డిస్ ప్లే కర్వ్డ్ గా ఆకర్షణీయంగా ఉంటుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే తో ఈ ఫోన్ ను రూపొందించారు. ఇక ఫొన్ బ్లూ, గ్రాఫైట్ మటె రంగుల్లో అందుబాటులో ఉంది.

- Advertisement -

బ్యాటరీ సామర్థ్యం 4,600 ఎంఏహెచ్. 66 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో 22 నిమిషాల్లో ఫోన్ 50 శాతం ఛార్జ్ అవుతుంది. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్. యూఎస్బీ టైప్ -ఏ పోర్టు ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్ తో పెర్ఫామెన్స్ బాగుంటుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ ను రూపొందించారు.

ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్ గా ఉంది. 64 మెగా పిక్సెల్ ఆరా లైట్ ఓఐఎస్ కెమెరాతో ఫొటోలు కూడా అద్భుతంగా వస్తాయి. నైట్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంతో రాత్రివేళల్లోనూ మంచి లైటింగ్ తో చాలా స్పష్టంగా ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంటుంది. 4కే వీడియో సపోర్టు కూడా ఉంటుంది.

ధ‌ర వివ‌రాలు..

ఐకూ జడ్ 7 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ రూ. 23,999 గా నిర్ణయించింది. బ్యాంకు ఆఫర్లో రూ. 2 వేల డిస్కౌంట్ తో దీన్ని రూ. 21,999 కే సొంతం చేసుకోవచ్చు.

అలాగే 8 జీబీ ర్యామ్, 258 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 24,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్ లో దీన్ని రూ. 22,999 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్లలో ర్యామ్ ను మరో 8 జీబీ ఎక్స్ టెండ్ చేసుకోవచ్చు.

అయితే ఈ ఫోన్ల సేల్ సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ లో ప్రారంభమవుతుంది. ఐకూ ఇండియా అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్లు, ఎక్స్ఛేంజీ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement