Friday, May 10, 2024

TS: త్వరలో కాంగ్రెస్ లోకి తుమ్మల..?

బీఆర్ఎస్ అసంతృప్త నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ నేతలు తుమ్మలను ఆహ్వానించారు. తుమ్మలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు భేటీ అయ్యారు. ఈసందర్భంగా తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ జాబితాలో సీటు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అలాగే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇటీవలే భారీ కార్ల ర్యాలీతో బలప్రదర్శన చేసిన విషయం విధితమే. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు తుమ్మలను కలిసి కాంగ్రెస్ లోకి రావాలని, కలిసి పనిచేద్ధామని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement