Wednesday, April 17, 2024

NDvsPAK | బ్యాటర్‌గా నేను ఎవరికైనా భయపడితే, అది అత‌నికే.. పాక్ మాజీ ప్లేయ‌ర్ బాసిత్ అలీ

ఆసియా కప్ 2023లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడనున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ బ్యాటర్ బాసిత్ అలీ.. ప్ర‌స్తుత‌ బాబర్ ఆజం నేతృత్వంలోని జట్టును హెచ్చరించాడు. సెప్టెంబరు 2, శనివారం క్యాండీలో పాకిస్తాన్- భారత్ తలపడ‌నున్నాయి. అయితే టోర్నమెంట్‌లో రెండు జ‌ట్లు సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో సహా ఈ మూడు సార్లు త‌ల‌ప‌డ‌నున్న‌ట్టు బాసిత్ భావిస్తున్నాడు.

‘‘పాకిస్థాన్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ లైన‌ప్ ఉంది.. అయితే, విరాట్ కోహ్లి వంటి బ్యాటర్ పాక్ కు ప్రమాదకరమే.. పాకిస్థాన్‌పై విరాట్ అద్బుతంగా రాణిస్తాడు. బ్యాటర్‌గా నేను ఎవరికైనా భయపడితే అది విరాట్ కోహ్లీనే’’ అని బాసిత్ నాదిర్ అలీ పేర్కొన్నాడు.

వన్డేల్లో పాకిస్థాన్‌పై అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు కోహ్లీ. 13 మ్యాచ్‌ల్లో 48.72 సగటుతో 536 పరుగులు చేశాడు. నిజానికి, 2012లో మీర్‌పూర్‌లో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తన అత్యధిక ODI స్కోరును పాకిస్తాన్‌పై సాధించాడు. పాకిస్తాన్ తో జరిగిన ముఖ్యమైన ఘర్షణలో పాక్ 329 భారీ టార్గెట్ సేట్ చేయ‌గా.. విజయం సాధించేందుకు 330 పరుగుల భారీ స్కోరును ఛేదించి పాకిస్థాన్‌ను చిత్తు చేసేందుకు అడుగు పెట్టాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ అథ్య‌దికంగా 148 బంతుల్లో 183 ప‌రుగులు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement