Sunday, April 28, 2024

పోలీసు ఉద్యోగార్థులకు మరో శుభవార్త.. ఎన్నిపోస్టుల‌కు అప్లై చేసినా ఒకేసారి ఫిజిక‌ల్ టెస్ట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడతున్న వారికి పోలీసు నియామక మండలి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి పీఎంటీ, పీఈటీ లాంటి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరైతే సరిపోయేలా కార్యాచరణ రూపొందించింది.

అభ్యర్థులు ఒకసారి పాల్గొన్న పరుగు పందెం, షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌ లాంటి పోటీలే కాకుండా వారి శారీరక కొలతల ఫలితాలను మూడు నెలల పాటు పరిగణనలోకి తీసుకోనున్నట్లు నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement