Thursday, May 2, 2024

అక్క‌డ జ‌న‌నం … ఇక్క‌డ మ‌ర‌ణం…చిరుత‌ల‌ జీవితాలు వ్య‌ధా భ‌రితం

భోపాల్ – దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతలలో ఈరోజు మరొకటి చనిపోయింది. ధాత్రి అనే ఆడ చిరుత అనారోగ్య కార‌ణాల‌తో మ‌ర‌ణించిన‌ట్లు పార్క్ నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో గ‌డిచిన ఆరు నెలల్లో తొమ్మిది చిరుత‌లు మ‌ర‌ణించాయి.. ఈ చిరుత మృతితో ప్రాజెక్టు చీతాకు పెద్ద ఎదురుదెబ్బ అని పరిశీలకులు అంటున్నారు. వాటి మరణాలు కునో నేషనల్ పార్క్ నిర్వహణపై అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చిన ఆడ చిరుత ధాత్రి కునో నేషనల్ పార్క్ లో చనిపోవడం బాధాకరమని, ఇది ఇప్పటివరకు తొమ్మిదో మరణం అని మధ్యప్రదేశ్​ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి చౌహాన్ తెలిపారు. కాగా,గత వందేళ్లలో వేటగాళ్ల దెబ్బతో దేశంలో చిరుతల ఉనికి లేకుండాపోయింది. దీని కారణంగా దేశంలో మళ్లీ చిరుతలను తిరిగి పెంపొందించే కార్యక్రమంలో భాగంగా 17 ఫిబ్రవరి 2023న ఇరు దేశాల సహకార ఒప్పందంలో భాగంగా దక్షిణాఫ్రికా 12 చిరుతలను భారతదేశానికి తరలించింది. అలాగే నమీబియా నుంచి మరో 8 చీతాల వచ్చాయి.. ఆ తర్వాత వాటిలో నాలుగు పిల్లలు పుట్టడంతో ఆ సంఖ్య 24కి పెరిగింది..
అయితే అక్కడి వాతావరణ పరిస్థితులకు ఆట‌వాటుప‌డ్డ చీతాలు భార‌త ప‌రిస్థితుల‌కు ఆల‌వాటు ప‌డ‌లేక‌పోయాయి.. దీంతో గ‌డిచిన ఆరు నెల‌ల‌ల్లోనే తొమ్మిది చీతాలు క‌న్నుమూశాయి.. జిపిఎస్ ట్రాకింగ్ రెడియోష‌న్ తో మ‌ర‌ణిస్తున్నాయ‌నే అనువానంతో వాటికి అమ‌ర్చిన జిపిఎస్ చిప్స్ ను తొల‌గించారు కునో ఫారెస్ట్ అధికారులు. ఆయ‌న‌ప్ప‌టికీ మ‌ర‌ణాలు కొన‌సాగుతూనే ఉన్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement